నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన

నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ఈ మేరకు టూర్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తుంబూరు దయాకర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా సుజాతనగర్ మండలంలోని సర్వారం గ్రామానికి ఉదయం 10 గంటలకు చేరుకుంటారని పేర్కొన్నారు. అనంతరం సింగభూపాలెం, రాఘవపురం, సుజాతనగర్లలో పర్యటించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కలుసుకుంటారని తెలిపారు. ఆ తర్వాత కొత్తగూడెం (విద్యానగర్) లోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తారు. తర్వాత కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఎంపీ పర్యటన కొనసాగుతుందని పేర్కొన్నారు. సాయంత్రం 4:30 గంటలకు రామవరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి.. తన భారీ విజయానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతారు. అనంతరం గౌతమ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఎంపీ రఘురాం రెడ్డి సమావేశమవుతారని. కూలీలైన్, న్యూ గొల్లగూడెం లలో 16, 17, 18, 19, 20, 24వ వార్డులకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుంటారు. వారితో ఆత్మీయ సమావేశమవడంతో పాటు.. ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలు తెలుసుకుంటారని దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. కావున నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై ఎంపీ రఘురాం రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .