శ్రీ వైష్ణవ కుటుంబాలకు ఎంపీ వద్దిరాజు సాయం
- 50 వరద బాదిత కుటుంబాలకు రేషన్ కిట్లు అందజేత
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఖమ్మం మున్నేరు వరద ప్రవాహంలో నిరాశ్రయులైన శ్రీ వైష్ణవ కుటుంబాలను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పెద్దమనసుతో ఆదుకున్నారు. సుమారు 30 కుటుంబాలకు నెలకు సరిపడా కిరాణ సామాగ్రి కిట్లు అందజేశారు. బాధిత కుటుంబాల దుస్థితిని శ్రీ వేంకటేశ్వర చాత్తాద శ్రీ వైష్ణవ సేవా సమితి రాష్ట్ర కమిటీ ప్రతినిధులు హైదరాబాద్ లో ఎంపీ రవిచంద్ర ను కలిసి ఆయనకు వివరించారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ.. వినతి పత్రాన్ని అందజేశారు. ఎంపీ రవిచంద్ర ఆదేశాల మేరకు ఆయన క్యాంపు కార్యాలయ సిబ్బంది గురువారం ఖమ్మంలో వాటిని బాధితులకు అందజేశారు.
ఇప్పటికే ఎంపీ రవిచంద్ర ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో మున్నేరు నదీ ప్రవాహంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు సుమారు 3 వేల రేషన్ కిట్లు అందజేశారు. వరద ప్రభావానికి నిరాశ్రయులైన ఖమ్మం జర్నలిస్టులను సైతం ఆదుకున్నారు. శ్రీ వైష్ణవ కుటుంబాలకు సైతం ఆయన పెద్ద మనసుతో ఆదుకోవడంలో పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ సయ్యద్ ఇస్మాయిల్, శ్రీ వైష్ణవ సేవా సమితి జిల్లా ఉపాధ్యక్షులు తిరునగరి వెంకటరమణ, తెలంగాణ ఉద్యమకారుడు వద్దిరాజు యువసేన సభ్యులు నానబాల హరీష్, ఆకుల సాయి, మద్దెల భానుప్రతాప్, తరుణ్, అరుణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Comments