ఎమ్మేల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కాలని పాదయాత్ర

ఎమ్మేల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కాలని పాదయాత్ర

మక్తల్ , తెలంగాణ ముచ్చట్లు:

తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కాలని కోరుతూ,అమరచింత మండలము కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేశారు. అమరచింత మండలం చంద్రనాయక్ తండాకు చెందిన హన్మంతు నాయక్ ( ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు), సూర్యనాయక్ ఇద్దరూ తమ ఊరి నుంచి దాదాపు 45 కిలోమీటర్ల మక్తల్ కు పాదయాత్ర నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగున్నర కు పాదయాత్ర ప్రారంభించామని, సాయంత్రం అయిదు గంటల వరకు మక్తల్ పట్టణానికి చేరుకున్నామని అన్నారు . అనంతరం స్థానిక పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మక్తల్ కాంగ్రెస్ పార్టీ నేతలు వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎమ్మేల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కితే వెనుకబడిన మక్తల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు కట్టా సురేష్ గుప్తా, బోయ రవికుమార్, నాగరాజు, ఓబ్లేశ్, కల్లూరి గోవర్ధన్, గుంతలి రవి, వేణు గౌడ్, సురేందర్ గౌడ్, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .