పెద్దమందడిలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం
రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ తల్లిని అవమానించారు
--- పెద్దమందడి బీఆర్ఎస్ నాయకులు
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తూ... తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం పెద్దమందడి మండల కేంద్రంలో టిఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని మాట తప్పి , ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించడం దురదృష్టకరమని అన్నారు. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ తల్లిని, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి అదే స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వేణు యాదవ్, పెద్దమందడి గ్రామ అధ్యక్షుడు సేనాపతి, వెల్టూర్ బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మల్లక్ సురేష్, కురుమూర్తి, వంకాని ఆంజనేయులు, జంగం నరేష్, నరసింహ, ఆంజనేయులు, ఎల్ఐసి రాములు, నాగభూషణం, సింగిరెడ్డి రాజు, తదితరులు పాల్గొన్నారు.


Comments