నూతన మండల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పళ్ళ సుందర్ రాంరెడ్డి
తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల :
దేవరుప్పుల మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పల్ల సుందర్ రాంరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో అన్ని విధాలుగా అండగా ఉంటామని పార్టీ కార్యాలయాన్ని కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తీగల దయాకర్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు యువజన నాయకులు పాల్గొన్నారు.
*పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు*
*పతాకావిష్కరణ చేసిన మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్*
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గురువారం దేవరుప్పుల మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలసి జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ అనంతరం స్వీట్లు పంపిణీ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పునరాంకితం కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments