పామిరెడ్డిపల్లి మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటా

పామిరెడ్డిపల్లి మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటా

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

• ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25000 తక్షణ సహాయం

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామ ఇద్దరు యువకులు బుధవారం రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. శుక్రవారం బాధిత కుటుంబాలను వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి పరామర్శించారు. 

పిల్లల చదువులు, ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇంటి కేటాయింపుల్లో రెండు కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్న ఎమ్మెల్యే

ఈనెల 28వ తేదీ బుధవారం సాయంత్రం పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామం వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని ఆదేరువు కోల్పోయిన ఆ కుటుంబాలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటానని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు.

మొదటగా మృతి చెందిన యువకుడు శ్రీపురంచందు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించే వారి తల్లిదండ్రులను ఓదార్చి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా కల్పించారు. తక్షణ సహాయంగా రూ.25000 అందించారు.

అనంతరం మరో యువకుడు కావలి అశోక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కుటుంబాలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటానని... ఎలాంటి అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. కుటుంబ సభ్యులకు రూ .25 వేల రూపాయలను తక్షణ సహాయం కింద ఆయన అందించారు.

కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, గ్రామ పెద్దలు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .