పాస్టర్లు మంచి సమాజాన్ని నిర్మించాలి - ఎమ్మెల్యే కడియం శ్రీహరి
క్రైస్తవ్యం అంటే జీవిత విధానాన్ని మార్చేది క్రైస్తవ జీవితాలు ఇతరులకు మాదిరిగా ఉండాలి దవజనులు ఇతరులకు ఆదర్శంగా గా ఉండాలి నియోజకవర్గ పాస్టర్లకు అన్నివేళలా అండగా ఉంటాను ఎంపీ నిధులనుండి నియోజకవర్గంలో క్రైస్తవ కమ్యూనిటీ హాల్ను నిర్మిస్తాం
స్టేషన్ ఘనపూర్ :తెలంగాణ ముచ్చట్లు
స్టేషన్ ఘన్‌పూర్ మండలం, శివునిపల్లి గ్రామములోని కె ఆర్ గార్డెన్స్ లో నియోజకవర్గ పాస్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన వరంగల్ ఎం.పి డా. కడియం కావ్య ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ కడియం కావ్య గెలుపు కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు. ఒకే వేదిక పై తండ్రి ఎమ్మెల్యేగా కూతురు ఎంపీగా చూడడం కన్నుల పండుగగా ఉందని మీరు అంటున్నారు. అది మీ అందరి ఆశీర్వాదం వల్లే సాధ్యమైందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇప్పుడు మా బాధ్యత మరింత పెరిగిందని తెలియజేశారు. ఈ బాధ్యతను గుర్తెరిగి నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. భారతదేశంలో మాత్రమే ప్రజాస్వామ్యం పదిలంగా ఉందని వెల్లడించారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అన్నారు. భారతదేశ ప్రజలు దైవన్ని నమ్మి భక్తితో క్రమశిక్షణతో ఉంటారని, ఏ రకమైన విద్వేషాలకు వెళ్ళకుండా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అందరూ ఒకే కుటుంబంలా కలసి ఉండడం వల్లే ఇది సాధ్యం అయిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. రాజకీయ కోట్లాటలు లేని నియోజకవర్గంగా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్దాం అని
పిలుపునిచ్చారు. క్రిస్టియన్ అంటే జీవిత విధానాన్ని నేర్పే మార్గం దర్శకలుగా ఉండాలి అని అన్నారు. చర్చి పాస్టర్ లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, నిరుపేద పాస్టర్ లకు అండగా ఉంటానాని ఎమ్మెల్యే అన్నారు. ఇల్లు లేని పాస్టర్లకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని వెల్లడించారు. గ్రామాల్లో స్మశాన వాటికల ఏర్పాటుతో పాటు త్వరలో ఘనపూర్ నియోజకవర్గం లోని ఏడు మండలాల్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తానని అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న చర్చిలకు పరిమిషన్లు ఇప్పిస్తానని వెల్లడించారు.
వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ
పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎంపీ మొదటి విడుత నిధుల నుండి నియోజకవర్గంలోని కమ్యూనిటీ హల్ నిర్మాణానికి మంజూరు ఇస్తానని తెలిపారు. ఎంతో గొప్ప అనుభవం ఉన్న గొప్ప నాయకుడు స్టేషన్ ఘన పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గా ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టం అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి తో కలిసి కృషి చేస్తానని తెలియజేశారు. మా నాన్నగారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి నన్ను గెలిపించడానికి ఎంతో కష్టపడ్డారని, వారి రుణం తీర్చుకోలేనిదని అన్నారు. ప్రజా సమస్యల పై పార్లమెంట్ లో గల మెత్తుతానని స్పష్టం చేశారు. ఎంపీగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో దైవ సేవకులు బాలస్వామి, కేసి జాన్, బన్నీ దేవవరం, టి ప్రవీణ్, కోర్నేల్, మోజస్, తిమోతి, యాకోబ్ సతీష్ డానియల్, మార్క్, కుమార్, రాజు, లూకా, నియోజకవర్గంలోని మండలాల పాస్టర్ అధ్యక్షులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Comments