చెరువులో పూలు చల్లినంత మాత్రాన ప్రజలు విశ్వసించరు
--గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంగ్లా బాబు రెడీ
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ పెద్ద చెరువు నిండడం జరిగింది. మంగళవారం మాజీమంత్రి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి వెల్టూర్ చెరువును సందర్శించి గంగమ్మ తల్లికి పూజ నిర్వహించడం జరిగింది. దీంతో వెల్టూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంగ్లా బాబు స్పందిస్తూ.. వర్షాలతో చెరువు నిండి అలుగు పారితే అవగాహన లేకుండా బీఆర్ఎస్ నాయకులు చెరువులో పూలు చల్లడం, పూజలు నిర్వహిస్తూ.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. గత పాలకులు అభివృద్ధి పేరుతో అందిన కాడికి దోచుకున్నారని ఎద్దేవా చేశారు. చెరువులను అడ్డం పెట్టుకొని భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు చెరువులపై చూపుతున్న వైఖరిని ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని అన్నారు.భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు, అలాగే సిసి రోడ్డు నిర్మాణం పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు.


Comments