పోచమ్మ తల్లి దేవాలయా దారి చదును
కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు గొడిశాల వేణు గౌడ్
తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల:
గ్రామదేవత దేవతల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఆ దేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలని కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు గోడిషాల వేణు గౌడ్ అన్నారు.మండలంలోని పెద్దమడూరు గ్రామంలోని గౌడ కులస్తుల అరాధ్య దైవమైన శ్రీ పోచమ్మ తల్లి పురాతన దేవాలయానికి సోమవారం కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు గోడిషాల వేణు గౌడ్ తన సొంత ఖర్చుతో మొరం పోయించి దారి చదును చేపించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానవాళికి మనశ్శాంతి దొరుకుతుందని అన్నారు.ఆలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమవంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.పురాతనమైన పోచమ్మ తల్లి దేవాలయ దారికి మొరంతో చదువు చేయించిన వేణు గౌడ్ ను గౌడ కులస్తులు గ్రామ ప్రజలు అభినందించారు.ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు గోడిషాల నరసయ్య మామిళ్ళ ప్రశాంత్ గోడిశాల యాదగిరి గోడిశాల శివ తదితరులు పాల్గొన్నారు.


Comments