పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన

- నాయకన్ గూడెంలో యాకుబ్ కుటుంబానికి పరామర్శ

పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన

- బుద్ధారంలో బ్రిడ్జి, రోడ్డు మరమ్మత్తుల కోసం ఆర్ అండ్ బి ఎస్ఈకి వినతి

- ఖమ్మం రూరల్ లోనూ బాధిత కుటుంబాలకు భరోసా

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

 కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో మంగళవారం పర్యటించారు. భారీ వర్షాలకు అతలాకుతలమైన గ్రామాలను సందర్శించారు. కూసుమంచి మండలంలో నాయకన్ గూడెం, నర్సింహుల గూడెం, పెరిక సింగారం, కూసుమంచి గ్రామాలను, నేలకొండపల్లి మండలంలో బుద్ధారం, కట్టుకాచారం గ్రామాలను, ఖమ్మం రూరల్ మండలంలో జలగంనగర్, కరుణగిరి పరిసరా ప్రాంతాలను సందర్శించారు. వరద బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాయకన్ గూడెంలో వరదల్లో కొట్టుకుని పోయిన యాకుబ్ కుటంబాన్ని పరామర్శించారు. అతని భార్య ఆచూకీని వీలైనంత త్వరగా గుర్తించాలని అధికారులను కోరారు. నేలకొండపల్లి బుద్ధారంలో వర్షాలకు కొట్టుకుని పోయిన బ్రిడ్జి, రోడ్డు పనులను వీలైనంత త్వరగా మరమ్మత్తులు చేయించాలని ఫోన్ ద్వారా కోరారు. కట్టుకాచారంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని విద్యుత్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముఖ్య కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .