భారతీయ సంప్రదాయంలో తోబుట్టువుల ప్రేమకు రక్షాబంధన్ ప్రతీక 

-మాజీ ఎంపీ నామ

భారతీయ సంప్రదాయంలో తోబుట్టువుల ప్రేమకు రక్షాబంధన్ ప్రతీక 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు:

సోదర, సోదరీమణుల ప్రేమకు ప్రతిరూపంగా రాఖీ నిలుస్తుందని బిఆర్‌ఎస్‌ మాజీ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలకు నామ నాగేశ్వరరావు ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. అన్న చెల్లెళ్ల అనుబంధం గురించి మాటల్లో చెప్పలేమన్నారు. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు రక్షాబంధన్‌ ప్రతీకగా నిలుస్తుందన్నారు. అక్కా చెల్లమ్మలందరికి రాఖీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళల కోసం బతుకమ్మ చీరెలు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లు, కేసీఆర్‌ కిట్టు, కళ్యాణ లక్ష్మీ వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారన్నారు. 17వ లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్‌లోనూ, బయటా బిఆర్ఎస్‌ ఎంపీలు పోరాడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .