సింగభూపాలెం చెరువుకట్ట పరిశీలన..పాల్వంచ మండలంలో పరామర్శ
కొనసాగుతున్న ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన
Views: 12
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఉదయం తోలుత సుజాతనగర్ పరిధిలోని చెరువుకట్టను పరిశీలించారు. ఇటీవలి భారీ వర్షాలకు కట్ట కుంగిందని స్థానికులు తెలపగా.. ఎంపీ స్పందిస్తూ ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడారు. సత్వరమే మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక రైతులు, గ్రామస్తులతో మాట్లాడుతూ..అండగా ఉంటానని అభయమిచ్చారు. ఆ తర్వాత దంతెలబోరు పరిధిలో కిన్నెరసాని వరద ప్రభావంతో దెబ్బతిన్న కుటుంబాలను పరామర్శించారు. జారే సాయికృష్ణ కుటుంబాన్ని ఓదార్చారు. ఇంకా కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలో పర్యటన కొనసాగుతోంది. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాస రావు, కొప్పుల చంద్రశేఖర్, ఆళ్ళ మురళి, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments