అప్రమత్తంగా ఉండండి మంత్రి తుమ్మల ఆదేశం
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలవాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎప్పటికప్పుడు జిల్లాలోని పరిస్థితులపై సమీక్షిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువులు కుంటలు పొంగిపొర్లుతున్న క్రమంలో ఆయా ప్రాంతాల్లో ప్రజలు సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు సూచనలు చేయాలన్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు హెడ్ క్వార్టర్ వదలకుండా ఆయా ప్రాంతాల్లో సిబ్బందికి సూచనలు చేస్తూ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టరేట్లో, మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అందుబాటులోంచిన హెల్ప్ లైన్ సెంటర్లను సంప్రదించాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లోనీ ప్రజలు భారీ వర్షాల వల్ల గతేడాది ఇబ్బందులు పడ్డారని, అలాంటి ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు.


Comments