ఆసరా రాదాయే బ్రతుకు భారమాయే
ఆసరా మా అండ అనుకున్నవృద్ధులకు ఆసరే అందటం లేదు * ఆసరా ను పట్టించుకోని రేవంత్ ప్రభుత్వం*అవసరాలు తీరక ఆగమవుతున్న వృద్ధులు
స్టేషన్ ఘనపూర్ :తెలంగాణా ముచ్చట్లు
జనగామ జిల్లా ఘనాపూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మండల కోఆర్డినేటర్ బొంకూరి మహేష్ మాట్లాడుతూ 6 గ్యారంటీలనీ అడ్డం పెట్టుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అధికారం రాగానే ఆసరాను పట్టించుకోవడం లేదు 6 గ్యారంటీలలో అతి ముఖ్యమైనది వృద్ధులకు నెల నెల అందవలసిన ఆసరా పెన్షన్ ఈ యొక్క ఆసరా పెన్షన్ సరిగా సమయానికి అందక వృద్ధులు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు అయ్యా భగవంతుడా అంటూ కాలం నెట్టుకొస్తున్న వృద్ధులు గత ప్రభుత్వంలో ప్రతినెల క్రమం తప్పకుండా మొదటి వారంలోనే అందే పెన్షన్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సమయానికి అందక నెల చివరి వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎప్పుడు పెన్షన్ పడుతుందో తెలియదు బీపీ షుగర్లతో ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే వృద్ధులు తమ పిల్లలకు భారంగా ఉండకూడదు అని వచ్చిన పెన్షన్ తోనే సంబంధిత వ్యాధులకు మందులు కొనుక్కొని తమ అవసరాలు తీర్చుకునేవారు కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఆరు గ్యారంటీలలో అతి ముఖ్యమైన ఆసరా పెన్షన్ ని అసలు పట్టించుకోవడమే లేదు అవసరాలు తీరక పల్లెలలోని వృద్ధులు వితంతువులు అష్ట కష్టాలు పడుతున్నారు బ్రతుకు జీవుడా అంటూ కాలం వెళ్ళదిస్తున్నారు, మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ చంకలు గుద్దుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వృద్ధుల పట్ల వితంతువుల పట్ల ఎందుకు ఇంత అలసత్వం ప్రదర్శిస్తుందో అర్థం కావడం లేదు, బీపీ షుగర్లతో బాధపడే వృద్ధులు తమ పిల్లలకి వారి బాధను చెప్పుకోలేక మందులు కొనుక్కోలేక నానా బాధలు అనుభవిస్తున్నారు. 2000 పెన్షన్ 4000 చేస్తామని ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్న ఇప్పటివరకు ఆసరా పెన్షన్లను మాత్రం పట్టించుకోకుండా పది నెలలుగా పంగనామాలు పెడుతూనే వస్తుంది, అయినప్పటికీ నిరీక్షణతో నిరాశతో ఎదురుచూస్తున్న చాలీచాలని జీవితాలతో భారమైన బ్రతుకులతో కాలం వెళ్లబుచ్చుతున్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు వారు చెప్పినట్లుగా ఆసరా పెన్షన్ ని వెంటనే పెంచి వారికి సకాలంలో అందించాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.


Comments