సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంపై స్పందించిన టిడిపి నాయకులు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఖమ్మం పర్యటనపై మండిపడ్డ టిడిపి నాయకులు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రారంభించింది సీతారామ ప్రాజెక్టా లేక సత్తుపల్లి ప్రాజెక్టా అని ఎద్దేవా చేశారు. ఎందుకంటే సీతారామ ప్రాజెక్ట్ అయితే ఆ కాలువ ప్రయాణించే 140 కిలో మీటర్ల మేర గిరిజన ప్రాంతంలో ఎక్కడ భూములకు నీరు విడుదల చేసారో తెలపాలన్నారు, గోదావరి జలాలను జూలూరు పాడు నుండి ఇప్పటికే వాడకంలో ఉన్న సాగర్ ఆయకట్టుకి నీరు ఇవ్వడాన్ని క్రిష్ణా గోదావరుల సంగమం అని ఎలా అంటారని అన్నారు, ఎడారి ప్రాంతంగా వున్న గిరిజన ప్రాంతాన్ని వదిలేసి, ఇప్పటికే నీటి సౌకర్యం వున్న సత్తుపల్లి ప్రాంతానికి నీరు తీసుకపోవటం గిరిజన ప్రాంతానికి ద్రోహం చేయటం కాదా అని ప్రశ్నించారు, ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులకు ఎందుకు కామేపల్లి, కారేపల్లి, లాంటి గిరిజన ప్రాంతాలను గాలికి వదిలేశారు, ప్రభుత్వానికి సీతారామ ప్రాజెక్ట్ ఆయకట్టుకి నీరు ఇచ్చే వుద్దేశం వుంటే దీనిని ఎందుకు పాలేరు చెరువుకు అనుసందానం చేయటం లేదని అన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా బహిరంగ సభలో సీతారామ ప్రాజెక్ట్ కు సంబంధించిన డి.పి.ఆర్ ను కెసిఆర్ తయారు చేయలేదు అనటంలో అంతర్యం ఏంటని అన్నారు, ప్రాజెక్ట్ కట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్న మీరు డి.పి.ఆర్ కాపీని తయారు చేయలేరా ఖమ్మ జిల్లా పర్యటనకు వచ్చిన సిఎం జిల్లా సమస్యల గురించి మాట్లాడక పోవటమేమిటని అన్నారు, జిల్లా సమస్యలు చర్చకు రాకుండా బిఆర్ఎస్ ను తిట్టితూ జిల్లా సమస్యలు బయ్యారం స్టీల్ పరిశ్రమ ఏర్పాటు గురించి కాని ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు కావలసిన కొత్త బొగ్గు బావుల గురించి కాని, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల గురించి కాని, విష జ్వరాల భారిన పడి మరణించిన పేద కుటుంబాల గురించి కాని ఎందుకు మాట్లాడలేదని అన్నారు, ఈ జిల్లాకి ముఖ్యమంత్రిగా వచ్చరా లేక మీ మంత్రుల కోరికలు తీర్చటానికి వచ్చారా అని ప్రశ్నించారు, లేకుంటే ఏ ఒక్క ప్రజాసమస్య గురించి ఎందుకు మాట్లాడ లేదని ఖమ్మంజిల్లా ప్రజల పక్షాన టిడిపి డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొండబాల కరుణాకర్, ప్రధాన కార్యదర్శి కేతినేని హరీష్, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి అప్పారావు, నున్నా నవీన్, కర్ణాటి సీతారాములు, టీడీపి నాయకులు పాలడుగు క్రిష్ణప్రసాద్, నాగార్జున శ్రీనివాస్, కర్ణాటి అశ్వనీకుమార్, కన్నేటి పృద్వీ, కోనేరు అన్వేష్, నాగoడ్ల లక్ష్మణ్, చింతనిప్పు నాగేశ్వరావు, దామళ్ల శివాజి, పిరంగి మంగయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు.


Comments