బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

బిజెపి అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తాం 

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

---పెద్దమందడి మండల అధ్యక్షుడు తిరుపతయ్య 

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు: 

పెద్దమందడి మండలంలోని బిజెపి కార్యాలయం ముందు మండల అధ్యక్షుడు తిరుపతియ్య ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జాతీయ జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం బిజెపి మండల అధ్యక్షుడు తిరుపతయ్య మాట్లాడుతూ... సర్దార్ వల్లభాయ్ పటేల్ రజాకార్ల నుండి తెలంగాణను విముక్తి చేసి దేశంలో తెలంగాణను విలీనం చేసిన సెప్టెంబర్ 17 విమోచన దినంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విస్మరించిందని విమర్శించారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బాసెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ... తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అధికారికంగా నిర్వహిస్తాయని మాటలకే పరిమితం చేశాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తిరుపతయ్య, మండల ఇన్చార్జి బాశెట్టి శ్రీనివాసులు, శివారెడ్డి, ముప్పురి చెన్నయ్య, రాములు, రవి, రామ్ నరేష్, విటల్ రెడ్డి, బాబన్న, రాజేష్, బాలరాజు, ఆంజనేయులు, అశోక్, కరుణాకర్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .