సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కలిసి కోరిన సిపిఎం బృందం

సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కలిసి కోరిన సిపిఎం బృందం

తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల:

పాలకుర్తి నియోజకవర్గం లో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న మండల కార్యదర్శి మాచర్ల సారయ్యలు సోమవారం తొర్రూర్ లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రాన్ని అందజేసి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల నిర్మించాలని.మంచుప్పుల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసిస్తున్న వారికి మంచినీళ్ల సమస్య కరెంటు సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు.పాలకుర్తి మండలంలోని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతికి రావాలని ఆహ్వానించారు. చేన్నూర్ రిజర్వాయర్ పాలకుర్తి రిజర్వాయర్ పనులు పెండింగ్లో ఉండడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఆ పనులను పూర్తి చేయాలని కోరారు.అసంపూర్తిగా ఉన్నడబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని నిర్మాణం పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలందరికీ ఇవ్వాలని ఇండ్ల స్థలాలు లేని పేదలను గుర్తించి ఇంటి స్థలం మరియు ఇండ్ల నిర్మాణం చేపట్టే విధంగా చూడాలని కోరారు.పాలకుర్తి మండల కేంద్రంలో బస్టాండ్ ను పునర్నిర్మాణం చేయాలని మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ పేరుతో స్మారక భవనం నిర్మాణం చేపట్టేలా ప్రయత్నం చేయాలని కోరారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .