ఉద్యమకారులకు గుర్తింపు కాంగ్రెస్ పార్టీతోనే

ఓయూ జేఏసీ నేత ఇప్ప పృథ్వి రెడ్డి

ఉద్యమకారులకు గుర్తింపు కాంగ్రెస్ పార్టీతోనే

తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల :

ఉద్యమకారులకు కాంగ్రెస్ హయాంలోనే గుర్తింపు లభించింది ఓయూ జెఏసి నేత ఇప్ప పృథ్వి రెడ్డి అన్నారు.తెలంగాణ బీసీ కమిషన్ సభ్యురాలిగా ఎన్నికయిన బాలలక్ష్మిని ఓయూ జేఏసీ నేత ఇప్ప పృథ్వి సోమవారం హైదరాబాదులోని ఖైరతాబాదులో కలిసి శుభాకాంక్షలు తెలిపి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు గుర్తింపు ఉంటుందనడానికి బాలలక్ష్మి బీసీ కమిషన్ సభ్యురాలిగా ఎన్నికవడమే నిదర్శనమని తెలిపారు.తెలంగాణ ఉద్యమంలో బాలలక్ష్మి పాత్ర అనిర్వచనీయమని,కేవలం తెలంగాణ ఉద్యమమే కాక అనేక సామజిక ఉద్యమాల్లో బాలలక్ష్మి పాత్ర ఉందని అన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని,కెసిఆర్ కుటుంబానికి,వారి బంట్రోతులకు మాత్రమే పదవులు దక్కాయని,కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు తప్పక అమలు అవుతాయన అన్నారు.ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల యువజన నాయకులు కరికే విజయ్ కుమార్తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .