ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం...!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం...!

- మంత్రిపొంగులేటి క్యాంపు కార్యాలయం లో సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి అన్నారు. ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల చెక్కుల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా రెండు మండలాలకు చెందిన 37మంది లబ్ధిదారులకు రూ. 11 లక్షల 50వేలు విలువ చేసే చెక్కులను అందించారు. స్వర్ణకుమారి మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా మంత్రి పొంగులేటి కృషి చేస్తున్నారన్నారు. పాలేరు ప్రజలకు ఏ కష్టం వచ్చినా మంత్రి పొంగులేటి శీనన్న ఆదుకుంటారని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చావా శివరామకృష్ణ, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, మద్దుల పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జడల నగేష్ గౌడ్ , శాఖమూరి రమేష్, తాటికొండ కిరణ్, అశోక్, దూదిమట్ల వెంకట్, నాగరాజు, వెంకన్న, ఉన్నం రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .