ప్రజా పోరాటాలతో పార్టీని బలోపేతం చేయాలి
-సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు యస్.నవీన్ రెడ్డి పిలుపు
-డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు చింతల.రమేష్ పిలుపు
-సిపిఎం చిమ్మపూడి గ్రామ నూతన శాఖ కార్యదర్శిగా రేమల్లె.జైపాల్ ఏకగ్రీవంగా ఎన్నిక
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ప్రజా సమస్యలపై పోరాటాలు చేసి సిపిఎం పార్టీని బలోపేతం చేయాలనీ సీతారాం ఏచూరి స్ఫూర్తితో ఉద్యమించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు యస్. నవీన్ రెడ్డి,డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు చింతల.రమేష్ లు పిలుపునిచ్చారు.
స్థానిక చిమ్మపూడి గ్రామంలో సిపిఎం గ్రామ నాయకుడు రేమల్లె. జ్యోతిబసు అధ్యక్షతన సిపిఎం చిమ్మపూడి గ్రామ శాఖ మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిదులుగా వారు హాజరై మాట్లాడుతూ చిమ్మపుడి గ్రామంలో పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్స్ నీ వెంటనే పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు.దేశ రాజకీయాలలో కామ్రేడ్ సీతారాం ఏచూరిది చెరగని ముద్ర అన్ని, తన మేధస్సుతో దేశంలో మతోన్మాద శక్తులకు అడుకట్ట వేశాడని వారు తెలిపారు.కమ్యునిస్ట్ యోధుడు మార్క్సిస్టు మేధావి కామ్రేడ్ సీతారాం ఏచూరి స్ఫూర్తితో నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు చేసి పార్టీని మరింత బలోపేతం చేయలని వారు పిలుపునిచ్చారు.అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.ఈ మహాసభలో సిపిఎం చిమ్మపూడి గ్రామ నూతన శాఖ కార్యదర్శిగా రేమల్లె.జైపాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మహాసభలో కమిటీ సభ్యులుగా ఎన్నికైన రేమల్లె. జ్యోతి బసు, స్వర్ణలత, చింతల.చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.


Comments