ఎమ్మెల్యే కృషితో పామిరెడ్డిప‌ల్లిలో విద్యుత్ లోవోల్టేజీ స‌మ‌స్య తీరింది 

మండ‌ల కాంగ్రెస్ నాయ‌కులు మ‌ద్దిర శ్రీ‌శైలం

ఎమ్మెల్యే కృషితో పామిరెడ్డిప‌ల్లిలో విద్యుత్ లోవోల్టేజీ స‌మ‌స్య తీరింది 

వ‌న‌ప‌ర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కృషితో పామిరెడ్డిప‌ల్లి గ్రామంలో గ‌త 5 సంవ‌త్స‌రాల నుంచి ఏర్ప‌డిన విద్యుత్ లో వోల్టేజీ స‌మ‌స్య ప‌రిష్కారం ల‌భించింద‌ని మండ‌ల కాంగ్రెస్ నాయ‌కులు మ‌ద్దిర శ్రీ‌శైలం తెలిపారు. గ్రామంలో లో వోల్టేజ్ స‌మ‌స్య‌తో రైతులు ఇబ్బందుల‌కు గురి కావ‌డంతో పాటు గ్రామంలో త‌ర‌చుగా విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్ప‌డుతుంద‌ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన వెంట‌నే పామిరెడ్డిప‌ల్లి కి స‌బ్ స్టేష‌న్‌ను మంజూరు చేయించార‌ని వారు తెలిపారు. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు ఎమ్మెల్యే మేఘారెడ్డి కృషికి రుణ‌ప‌డి ఉంటామ‌ని గ్రామ కాంగ్రెస్ నాయ‌కులు చందు, న‌రేష్‌, ర‌ఘు గౌడ్‌, శాక‌త్ భాస్క‌ర్ రెడ్డి, విష్ణు, త‌దిత‌రులు ఉన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .