రాజకీయ రంగు పులుముకుంటున్న సుంకిశాల వ్యవహారం.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం

రాజకీయ రంగు పులుముకుంటున్న సుంకిశాల వ్యవహారం.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం

 రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం దాహార్తీ తీర్చే సుంకిశాల తాగునీటి పథకం చుట్టూ రాజకీయ రంగు పులుముకుంటోంది. సుంకిశాల పంప్ హౌజ్ నీట మునగడానికి కారణం ఎవరన్నదానిపై పరస్పరం విమర్శలు దాడి చేసుకుంటున్నాయి. సుంకిశాల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని,మంచి జరిగితే మాది, చెడు జరిగితే మీది అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ ధ్వజమెత్తుతోంది.
సుంకిశాల ఘటననను కూడా గత ప్రభుత్వం మీదికి నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నదని మండిపడుతోంది. సుంకిశాల పాపం ముమ్మాటికీ బీఆర్ఎస్‌దేనని, తప్పును కాంగ్రెస్ పైకి నెట్టాలని చూస్తున్నారని ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామని, వాస్తవాలను ప్రజల ముందు చూపెడతామని కాంగ్రెస్ అంటోంది. మసిపూసి బట్టమీద కాల్చివేస్తే సహించేది లేదని కాంగ్రెస్ హెచ్చరిస్తోంది. దీంతో సుంకిశాల కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి.
హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తి తీర్చేందుకు నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల వద్ద ఉమ్మడి ఏపీ సీఎంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్న సమయంలో పనులు చేపట్టారు. జిల్లాకు చెందిన సీపీఎం, టీడీపీ వర్గాలు అడ్డుకున్నారు. సుంకిశాల నుండి జిల్లాకు తాగునీరు ఇవ్వకుండా హైదరాబాద్ కు ఎలా తరలిస్తారంటూ ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో ఏర్పాటు చేసిన కోట్ల కార్యక్రమం సందర్భంగా జరిగిన పోలీస్ ఫైరింగ్ లో ఎస్ఐ చనిపోవడంతోపాటు ఇద్దరు తీవ్రంగా గాయపడదంతో సుంకిశాల పథకం అటకెక్కింది. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయంతో ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల (AMRP)పథకం రూపు దిద్దుకుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ ద్వారా పుట్టంగండి వద్ద ఎత్తిపోతల ద్వారా అక్కంపల్లి రిజర్వాయరు నుంచి కోదండాపూర్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ కు నీటిని చేర్చి, అక్కడ శుద్ది చేసి రోజుకు మూడు దశల్లో 270 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .