బీసీకి వరించిన టిపిసిసి అధ్యక్ష పదవి..!!

-పిసిసి అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

బీసీకి వరించిన టిపిసిసి అధ్యక్ష పదవి..!!

-గాంధీ భవన్ పీఠంపై ( గౌడు)

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపిసిసి)నూతన అధ్యక్షునిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేశారు.గత కొంతకాలం నుంచి తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ఎవరికీ దక్కుతుందోనని ఉత్కంటకు శుక్రవారం తెరపడింది.

అందరూ ఊహించిన విధంగానే అనుకున్నదే జరిగింది, గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఇప్పటివరకు దాదాపు తొమ్మిది నెలల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని భర్తీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెక్కుతుంది, ముఖ్యంగా టిపిసిసి అధ్యక్ష పదవి ఖాళీగా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఎంతోమంది ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల కేటాయింపు వంటి అంశాలకు మార్గం సుగమము అయ్యింది, గౌడ కులానికి చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ జీవితం 1990లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తూ 1994 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్చుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు, నిజాంబాద్ జిల్లాకు చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తిరిగి 2013 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేరు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పని చేశారు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజాంబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు, ఆ తర్వాత 2021 జూన్ 26న వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు ఇటీవల 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం 2024 జనవరిలో బొమ్మ మహేష్ కుమార్ ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు, ఈ విధంగా అంచలంచలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతూ చివరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా మహేష్ గౌడ్ నియామకం కావడం పట్ల తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు గౌడ కులస్తులు, గౌడ సంక్షేమ సంఘం నాయకులు,బీసీ సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు సంబరాలు అంబరాణి అంటే విధంగా టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .