దేవరకద్ర ఎమ్మెల్యే తండ్రి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన వనపర్తి ఎమ్మెల్యే
Views: 11
On
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారి తండ్రి ఈనెల 5వ తేదీన స్వర్గస్తులయ్యారు.
ఆ సమయంలో ఎంఎల్ఏ స్థానికంగా లేకపోవడంతో సోమవారం దేవరకద్ర ఎమ్మెల్యే గారి సొంత గ్రామం చిన్న చింతకుంట మండలం దమగ్నాపురంలోని వారి నివాసంలో ఆయనను కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా స్వర్గస్తులైన దేవరకద్ర ఎమ్మెల్యే గారి తండ్రి కృష్ణారెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఖిల్లా గణపురం మండల సింగిల్ విండో డైరెక్టర్, యువ నాయకులు సాయి చరణ్ రెడ్డి,వనపర్తి నియోజకవర్గ అసెంబ్లీ సమన్వయకర్త లక్కాకుల సతీష్, శ్రీరంగాపురం మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు, వహీద్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments