స్వార్ధ రాజకీయాల కోసం వెల్టూర్ గోపాల సముద్రం చెరువుని ధ్వంసం చేశారు

చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ను ఆక్రమించిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే

స్వార్ధ రాజకీయాల కోసం వెల్టూర్ గోపాల సముద్రం చెరువుని ధ్వంసం చేశారు

IMG-20240916-WA0036• ఆయకట్టుదారులకు రెండు పంటకు సైతం నీళ్లంద చేస్తామన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

గత ప్రభుత్వంలో కొందరు ప్రజా ప్రతినిధుల స్వార్థ రాజకీయాల కోసం నియోజకవర్గ పరిధిలోని పలు చెరువులను అభివృద్ధి పేరుతో ధ్వంసం చేశారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు.

సోమవారం పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామ గోపాల సముద్రం చెరువును ఆయన రైతులతో, అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు.

కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన చెరువు ఇప్పటివరకు చాలా పటిష్టంగా ఉన్నాయని కేవలం అభివృద్ధి పేరుతో పటిష్టంగా ఉన్న చెరులను ధ్వంసం చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జేబులు నింపుకున్నారే తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు.

వెల్టూరు చెరువు అలుగు సర్వే చేయించి ఆక్రమణలకు సంబంధించిన వారికి నోటీసులు అందించి వెంటనే తొలగించాలని మండల తాసిల్దార్ను అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

చెరువు కట్ట వెనకాల నీరు లీక్ అవుతున్న స్థలం వద్ద పరిరక్షణ చర్యలు చేపట్టి కట్టను పట్టిష్టం చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .