ముంపు ప్రాంతాల్లో పర్యటించిన విహెచ్
-బాధితులకు అండగా ఉంటామని హామీ
-నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విహెచ్ పర్యటన
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
మాజీ పార్లమెంటు సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి హనుమంతురావు శుక్రవారం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ తో కలిసి మున్నేటి పరీవాహక ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ముంపునకు గురైన వరద బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాలేరు, ఖమ్మం, మధిర నియోజక వర్గంలో ఆయన కలియ తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామంలో వరద తాకిడికి కొట్టుకుకుపోయిన యాకుబ్ సైదాభి కుటుంబాన్ని పరామర్శించి వారికి 50వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం నుండి అందాల్సిన సాయాన్ని త్వరగా అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సంధర్భంగా వి హనుమంతు రావ్ మాట్లాడుతూ.... అనుకోని ఉపద్రవం వల్ల ఖమ్మం జిల్లా అంతా అతలాకుతలం అయిందని ముంపు ప్రాంతాలలో పర్యటిస్తుంటే తాను ఎంతో చలించి పోయాయనని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ఎవరూ అధైర్య పడొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది అని అన్నారు. జిల్లాలో ఇప్పటికే ముగ్గురు మంత్రులు నిద్రాహారాలు మాని ముంపు ప్రాంతా వాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి వేరే పర్యటనలో ఉండి కూడా ఖమ్మం జిల్లా సమాచారం అందగానే హుటాహుటిన ఖమ్మం కు బయల్దేరి వచ్చి అధికారులతో వరదలపై సమీక్ష నిర్వహించారని తెలియజేశారు. ప్రభుత్వం ముందు చూపుతో ఉండబట్టే అంత పెద్ద మొత్తంలో వరదలు వచ్చినా ప్రజలను కాపాడగలిగారని తెలిపారు. ప్రభుత్వానికి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులకు, ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు సెరవేసిన మీడియా మిత్రులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. గత ముఖ్యమంత్రికి ఖమ్మం జిల్లా పర్యటన అంటేనే జ్వరం వచ్చేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య మంత్రి మాత్రం పదవి చేపట్టిన అనతికాలంలోనే రెండు మూడు సార్లు ఖమ్మం పర్యటించి సమీక్ష లు నిర్వహించారని తెలియజేశారు. స్వతహాగా ముఖ్యమంత్రే ముంపు ప్రాంతాలలో పర్యటించి బాధితుల కష్టాలను చేశారని వారి సమస్యలకు త్వరగా పరిష్కారం దొరుకుతుందని స్పష్టం చేశారు. బాధితులు ఎవరూ అధైర్య పడకుండా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అన్ని విధాల అండగా ఉంటుంది అని అన్నారు. అనంతరం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ...మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ముంపు బాధితులకు అండగా నిలవాలని సూచించారు. ప్రకృతి ప్రకోపం మూలన పాలేరు, ఖమ్మం, మధిర మున్నేరు పరిసర ప్రాంతాల ప్రజలు నిరాశ్రయుల్యారని కాంగ్రెస్ పార్టీ వారికి అన్ని విధాల అండగా ఉంటుంది అని అన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా సమీక్షలు నిర్వహిస్తున్నారని ఎప్పటికప్పుడు ఖమ్మం పరిస్తులను తెలుసుకుంటున్నారని అన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలుపెరగక శ్రమిస్తున్నారని 600 కోట్ల రూపాయలతో మున్నేరుకు కరకట్ట కట్టడానికి హ్యూహాలు రచిస్తున్నారని తెలిపారు. నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పాలేరు నియోజక వర్గంలో పెద్దతండ, నాయుడు పేట, సారథి నగర్, బొక్కల గడ్డ, మోతే నగర్, ప్రకాష్ నగర్, ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులతో పాటు దుస్తులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ముంపు భాదితులకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


Comments