వివేకానంద విగ్రహ ఏర్పాటుకు సహకరించాలి

ఎమ్మెల్యే ను కోరిన ధార్మిక సంస్థల నేతలు

వివేకానంద విగ్రహ ఏర్పాటుకు సహకరించాలి

మక్తల్ , తెలంగాణ ముచ్చట్లు:

పట్టణంలోని వివేకానంద చౌరస్తాలో స్వామి వివేకానందా విగ్రహ నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని కలిసి ఎబివిపి ఆధ్వర్యంలో ధార్మిక సంస్థల నేతలు వినతిపత్రం అందజేశారు. మంగళవారం మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏబీవీపీ హిందు ధార్మిక సంస్థల ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిశారు.స్వామి వివేకా నంద విగ్రహ ఏర్పాటుపై ఎమ్మెల్యే ను కోరగా సానుకూలంగా స్పందించారు. మహనీయుల విగ్రహాల ఏర్పాటుతో భావితరాలకు మార్గదర్శనాన్ని అందించడం శుభపరిణామామని ఎమ్మేల్యే అన్నారు. స్వామి వివేకానంద విగ్రహ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తన పరిమితులలో పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఇతరత్రా అనుమతులకు సంబంధించిన వ్యవహారాన్ని పూర్తి చేయాలని తెలియచేశారు.ఈ సందర్భంగా ఏబీవీపీ రామకృష్ణ మిషన్ , హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు శాలువాతో ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్, కిసాన్ సంఘ్ , ఏబీవీపీ, ధార్మిక సంస్థల ప్రతినిధులు కావలి వెంకటేష్, ప్రతాప్ రెడ్డి, చిట్యాల ఆంజనేయులు, కుర్మయ్య,వినయ్,వంశీ,సురేష్,వినయ్,నిఖిల్, నిహల్,సందీప్, ఎబివిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .