నగరాన్ని ప్రణాళికాబద్ధంగాఅభివృద్ధి చేస్తున్నాం
-రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Views: 8
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
నగరాన్ని ప్రణాళికాబద్ధంగాఅభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం మంత్రి నగరంలోని 34వ డివిజన్ లోని బురదరాఘవపురం లో రూ. 195 లక్షల వ్యయంతో నిర్మించనున్న మేజర్ స్మార్ట్ వాటర్ డ్రైన్, సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. నిర్మాణ పనులు నాణ్యతతో, నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. రోజువారి పనుల పురోగతిపై పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునకొల్లు నీరజ, కార్పొరేటర్లు, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments