ప్రజలకు నిరంతరం అండగా నిలుస్తాం
అభివృద్ధి, సంక్షేమమే మా ధ్యేయం
* ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
* కొత్తగూడెం నియోజకవర్గంలో విస్తృత పర్యటన
* కాంగ్రెస్ శ్రేణులతో సమావేశాలు, వినాయక మండపాల్లో పూజలు, సింగరేణి వర్క్ షాప్ సందర్శన
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్షమని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాo రెడ్డి అన్నారు. గురువారం ఆయన కొత్తగూడెం నియోజకవర్గంలో విస్తృతoగా పర్యటించారు. తొలుత సుజాతనగర్ పరిధిలోని సింగ భూపాలెం చెరువుకట్టను పరిశీలించారు. ఇటీవలి భారీ వర్షాలకు కట్ట కుంగిందని స్థానికులు తెలపగా.. ఎంపీ స్పందిస్తూ ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడారు. సత్వరమే మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక రైతులు, గ్రామస్తులతో మాట్లాడుతూ..అండగా ఉంటానని అభయమిచ్చారు. ఆ తర్వాత దంతెలబోరు పరిధిలో కిన్నెరసాని వరద ప్రభావంతో దెబ్బతిన్న కుటుంబాలను పరామర్శించారు. గంగాదేవి గుప్ప లో వరదలకు గల్లంతయిన జారే సాయికృష్ణ కుటుంబాన్ని ఓదార్చారు. ఆ తర్వాత పాల్వంచ, జగన్నాధపురoలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని.. సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా క్షేత్ర స్థాయిలో పనిచేయాలని సూచించారు.
*వినాయక మండపాల్లో పూజలు..*
కొత్తగూడెం లోని హనుమాన్ బస్తీ లో వినాయక మండపానికి వెళ్లి ఎంపీ రఘురాo రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఇంకా పాల్వంచలోని గాంధీబొమ్మ సెంటర్, జెడ్పీ ఎస్ ఎస్ పాఠశాల ప్రాంతం, కాంత్రాక్టర్స్ కాలనీల్లో విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు. ప్రజలంతా బాగుండాలని మొక్కుకున్నారు.
*సింగరేణి కార్మికులతో.. చెమ్మాస్ చేతబట్టి*
కొత్తగూడెం లోని సింగరేణి ఏరియా వర్క్ షాప్ ను ఖమ్మం ఎంపీ రామసహాయo రఘురాo రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సoదర్భంగా బొగ్గు తవ్వకమప్పుడు కార్మికుల మాదిరిగా హెడ్ ల్యాంప్ టోపీని ధరించి, చమ్మాస్ చేతబట్టి వారితో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రకటించారు.
*డాక్టర్ విజయేoదర్ రావుకు నివాళి*
కొత్తగూడెం లో ప్రముఖ ఆర్థో వైద్యులు విజయేoదర్ రావు మృతి చెందగా ఎంపీ రఘురాo రెడ్డి నివాళులర్పించారు. *ఈ కార్యక్రమాల్లో..* కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాస రావు, కోనేరు చిన్ని, ఆళ్ళ మురళి, కొప్పుల చంద్రశేఖర్, కొండా వెంకన్న, నాగేంద్ర త్రివేది, డాక్టర్ శంకర్ నాయక్, చీకోటి కార్తీక్, నూకల రంగారావు, తదితరులు పాల్గొన్నారు.


Comments