ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యే వరకు కాంగ్రెస్ ను నిలదీస్తాం
ఏపీజీవీబీ బ్యాంక్ ముందు బైఠాయించిన రైతులకు మద్దతు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల :
పంట రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్‌ఎస్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ప్రభుత్వం మూడు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ అర్హులైన తమకు రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరుప్పుల మండలంలోని సింగరాజుపల్లి ఏపీజీవీబీ బ్యాంక్ దగ్గర వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రుణమాఫీపై బ్యాంకర్లు, అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదని రైతులు మండిపడ్డారు. ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికి రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కుంటిసాకులతో జాబితాల్లోని రైతుల పేర్లను తొలగిస్తున్నారన్నారు. అన్ని సక్రమంగా ఉండి కూడా చాలా మంది రైతులకు డబ్బులు జమకాలేదన్నారు. బేషరతుగా షరతులు లేకుండా పంట రుణాలు మాఫీ చేయాలన్నారు. మొదటగా రైతు రుణమాఫీకి 49,500 కోట్ల అవసరమని చెప్పి మళ్ళీ మాట మార్చి కేబినెట్లో 31 వేల కోట్లు సరిపోతాయని చెప్పి మళ్లీ మాట మార్చి బడ్జెట్లో కేటాయించింది కేవలం 26 వేల కోట్లు మాత్రమే ఇందులో కూడా మూడు విడతల వారీగా చివరగా చేసిన రుణమాఫీ కేవలం 17 వేల కోట్లు మాత్రమే ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాటిమాటికి మాట మార్చి రైతులను మోసం చేస్తుందని అన్నారు. రుణమాఫీ కాక ఆందోళనలో ఉన్న లక్షలాది మంది రైతులకు తాము తమ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆరు కాలం కష్టపడి పండించిన రైతులకు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రైతుల పట్ల చిన్నచూపు చూస్తూనే ఉంది, పాలకుర్తి నియోజకవర్గంలో కనీసం పంట పండించుకునేందుకు రైతులకు సాగునీరు కూడా అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది వెంటనే ప్రభుత్వం దిగివచ్చి పూర్తిగా రుణమాఫీ చేసి అలాగే రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కనీసం 40 శాతం కూడా రుణమాఫీ కాకముందే రుణమాఫీ అయిపోయిందని సంబరాలు చేసుకోవడం చూస్తుంటే ఈ ప్రభుత్వం పట్ల ఎంత దుర్మాగ దోరణిలో ఉందో తెలుస్తుంది, రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ కావాల్సిన రైతులు 40 లక్షల మంది ఉంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసి రుణమాఫీ అయిపోయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది, రైతు రుణమాఫీకి ఈ ప్రభుత్వం చేసింది ఊరంతా అయితే ప్రకటనలకు ఖర్చు చేసింది కొనడం అని, ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తీగల దయాకర్ గౌడ్ బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి మాజీ మండల అధ్యక్షులు బస్వ మల్లేశం ప్రధాన కార్యదర్శి చింత రవి వర్కింగ్ ప్రెసిడెంట్ రాంసింగ్ నాయక్ జోగు సోమనర్సయ్య ఏల సుందర్ సుడిగెల హనుమంతు కొల్లూరి సోమయ్య ఆలకుంట్ల యాదగిరి కొత్త జలేెందర్ రెడ్డి యండి ఖాసీం బోనగిరి యాకస్వామి మేకపోతుల నర్సింహా కత్తుల విజయ్ కుమార్ రెడ్డి మేకల సంపత్ మాచర్ల బాబు పల్లెర్ల నవీన్ తోటకూరి కిష్టయ్య చింత సోమయ్య తాటిపల్లి మహేష్ లోడంగి వెంకన్న కాసాని ఎర్రయ్య రాజన్న నాయక్ ఇనుముల రంగయ్య తీగల సత్తయ్య గోలి ఉప్పల్ రెడ్డి నీలారపు వేణు గేమా నాయక్ కోతి ప్రవీణ్ వంగ అర్జున్ తోటకూరి దశరథ రామ్ చందర్ బూడిద ప్రశాంత్ చింత పరశురాములు ఎండి యాకు పాషా గాదరి శ్రీకాంత్ ఉప్పుల సామ్రాట్ జోగు ప్రదీప్ పార్టీ ముఖ్య నాయకులు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Comments