పేద ప్రజల గుండె చప్పుడు.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి

ఘనంగా వైఎస్సార్‌ వర్ధంతి వేడుకలు -కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు

పేద ప్రజల గుండె చప్పుడు.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి

తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల :

దేశంలోని అనేక రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేద ప్రజల గుండె చప్పుడని కాంగ్రెస్ దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు అన్నారు. సోమవారం వైఎస్సార్‌ 15వ వర్ధంతిని సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ మండల పార్టీ కార్యాలయం ఆవరణలో వైఎస్పార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్‌ దేశ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాడని అన్నారు. ఆరోగ్యశ్రీ, 108, ఫీజురీయింబర్స్‌మెంట్‌, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, ఉచిత కరెంట్‌, ఒక్క రూపాయికే కిలో బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, పేదలకు భూపంపిణీ, మహిళా సంఘాలకు వడ్డిలేని రుణాలు, సాగునీటి ప్రాజెక్టులు, ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులతో పాటు ఐటీ రంగాన్ని తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడని, ఇలా అనేక సంక్షేమ పథకాలకు ప్రాణం పోసిన మహానీయుడు తెలుగు రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజా నాయకుడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తోటకూరి పాండుకృష్ణ కాసారపు ధర్మారెడ్డి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు ఇనుముల నాగరాజు కాడబోయిన గణేష్ భూక్య సజ్జన్ నాయక్ యం.డి గులాం రసూల్ నాయకులు రెడ్డిరాజుల రమేష్ బోనగిరి యాకస్వామి ఓడపెల్లి రవీందర్ దావెర అనిల్ కుమార్ మహిళా అధ్యక్షురాలు భాగాల మాలతి రెడ్డి రాంచంద్రు నాయక్ పులిగిల్ల వెంకన్న తోటకూరి వెంకన్న లోడంగి అశోక్ గుగులోతు రాజేందర్ పారుపల్లి శ్రీను నీలారపు వెంకన్న కడారి అంజయ్య విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు కొంగరి ఉమేష్ ఆకుల వెంకన్న సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లు మాసంపల్లి సాత్విక్ ప్రదీప్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .