ఇందిరమ్మ కమిటీల్లో అసలైన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలి 

ప్రాధాన్యత ఇవ్వట్లేదని కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకుల ఆవేదన

ఇందిరమ్మ కమిటీల్లో అసలైన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలి 
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ జెడ్పిటిసి సదయ్య గౌడ్

 

 

కొన్ని ఏళ్ల నుండి జెండా మోసిన కార్యకర్తలకు అవకాశం కల్పించాలి 

స్టేషన్ ఘణపూర్,తెలంగాణ ముచ్చట్లు:

గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ జెండా మోసిన వారికి కాకుండా కొత్తగా పార్టీలో వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు ఇందిరమ్మ ఇళ్ల కమిటీలలో పాత వారికి కాకుండా పార్టీ మారి వచ్చిన కొత్తవారికి ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. గ్రామాలలో కాంగ్రెస్ జెండాలను భుజాలపై వేసుకొని కేసుల పాలై చివరికి అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన కాంగ్రెస్ నాయకులను అవమానిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కాంగ్రెస్ అధిష్టాన నాయకులు పార్టీలో కొత్తగా వచ్చిన వారికి కాకుండా గత కొన్ని ఏళ్లుగా కాంగ్రెస్ జెండాను నమ్ముకున్నా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.ఈ విషయం అధిష్టానం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకపోతామన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటిసి పట్టపూరి సదయ్య గౌడ్, నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జీ రడపాక రాజ్ కుమార్, నియోజకవర్గ యువజన నాయకులు తాటికాయల రాజేందర్, మండల అధికార ప్రతినిధి యండి ముఖ్తార్ ఆలీ, మండల నాయకులు ఉల్లి శివరాజ్ , మాజీ ఉపసర్పంచ్ నంచర్ల లత యాదగిరి, మర్రి రమేష్,బానోతు లచ్చిరాం నాయక్ , మండలంలోని వివిధ గ్రామశాఖఅధ్యక్షులుబానోతుబిక్షపతి,నీలంరాజయ్య,సముద్రాల సత్యనారాయణ సీనియర్ నాయకులు నీలం రమేష్, యువజన కాంగ్రెస్ నాయకులు రడపాక దానియేలు, నీలం శేఖర్,కందిక అఖిల్,ఇల్లెందులో అశోక్,దాట్ల కార్తీక్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .