పసిడి పతకాల జోరులో రెజోనేన్స్ విద్యార్థుల ప్రభ౦జనం
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు
ఖ
మ్మం పట్టణంలో ఈనెల 28 తేదిలో సౌత్ జోన్, రూరల్ మరియు చింతకాని మండల స్థాయి లో జరిగిన కబడ్డీ, వాలీ బాల్ టోర్నమెంట్స్ నిర్వహించటం జరిగింది, ఈ స్కూల్ గేమ్స్ లో బాగంగా మా పాఠశాల నుంచి విద్యార్ధులు కబడ్డి, వాలీ బాల్ ఆటలో పాల్గొని విజయకేతనం ఎగురవేసారు. అండర్-14 కబడ్డీ లో విభాగం నందు ఐ.పవన్ కుమార్, వాలీ బాల్ విభాగం నుంచి ఏ. సూర్య సుహాస్ బంగారు పథకం సాధించారు. అదేవిధంగా అండర్- 17 వాలీ బాల్ విభాగం నుంచి సిహెచ్. వర్షిత్ కుమార్ బంగారు పథకం సాధించి అంతర్ జిల్లా స్థాయి ఎంపిక అయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల డైరెక్టర్ నాగేంద్ర కుమార్ మరియు నీలిమ గార్లు మాట్లాడుతూ పథకాలు సాధించిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తు చదువుతో పాటు విద్యార్థులకు ఆటలలో శిక్షణ ఇస్తూ వారిలో దాగివున్న ప్రతిభను వెలుగు తీస్తూ వాళ్ళ యొక్క మనో ధైర్యాన్ని, ఏకాగ్రత, క్రమశిక్షణకు ఆటలు ఎంతో ముఖ్యమని తెలియజేస్తూ వారి సంతోషాన్నివ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొని మరియు పి.ఇ.టి గెలిచిన క్రీడాకారులకు అభినందనలు తెలియజేసారు.


Comments