శ్రీ రామ్ ఫైనాన్స్ ఉద్యోగులకు బాసటగా నిలిచిన సంస్థ
నిత్యావసర సామాగ్రి మరియు ఎలక్ట్రానిక్ గృహాపకరణ వస్తువులు వితరణ.
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
శ్ రామ్ ఫైనాన్స్ సంస్థ పురోభివృద్ధికి మూల స్తంభాలైన ఉద్యోగులకు మున్నేరు వరద ప్రవాహనికి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తిన సందర్భాలలో సంస్థ యాజమాన్యం వారిని తమ సొంత కుటుంబ సభ్యులుగా భావించి వారికి వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందించారు శ్రీ రామ్ ఫైనాన్స్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ జి నరసింహారావు మాట్లాడుతూ ఖ
మ్మం నగరంలోని కొన్ని ప్రాంతాలలో సంభవించిన మున్నేరు వరద విపత్తుతో గృహపకరణాలను కోల్పోయిన 32 మంది ఉద్యోగులకు 16 లక్షల రూపాయలు విలువ గలిగిన వస్తువులను వైరా రోడ్ లోని
శ్రీ రామ్ ఫైనాన్స్
ఖమ్మం జోనల్ ఆఫీస్ నందు శనివారం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఉద్యోగుల భద్రత తమ ప్రధాన బాధ్యత అని వివరించారు వరదల వల్ల తమ సంస్థ ఉద్యోగులు తీవ్ర కష్టనష్టాలు ఎదుర్కోవడం తమ సంస్థ యాజమాన్యాన్ని చాలా బాధించిందన్నారు ఇటువంటి సందర్భాలలో ఆర్థిక సహాయం కంటే గృహోపకరణాలు ఇవ్వడమే సముచితమని యాజమాన్యం భావించిందని పేర్కొన్నారు రిఫ్రిజిరేటర్, టీవీ,గ్యాస్ పొయ్యి, రైస్ కుక్కర్, కుర్చీలు, మిక్సీ, గ్రైండర్ వంటి నిత్య వినియోగ వస్తువులను సంస్థ యాజమాన్యం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం ఉద్యోగుల పట్ల సంస్థకు ఉన్న గౌరవాన్ని నిబద్ధతను తెలియజేస్తుందన్నారు తమ ఉద్యోగులు కూడా నిరంతరం సంస్థ అభివృద్ధికి కోసం పనిచేయాలని సూచించారు ఇతర సంస్థల వలే కాకుండా శ్రీరామ్ సంస్థ దేశవ్యాప్తంగా తమ శాఖలలో బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగి పట్ల ఇదే రకమైన భావన కలిగి ఉందన్నారు శ్రీ రామ్ ఫైనాన్స్ కుటుంబంలో సభ్యులుగా ఉన్న ప్రతి ఉద్యోగికి ఆర్థిక భరోసా కల్పించేందుకు సంస్థ యాజమాన్యం కట్టుబడి ఉందని తెలిపారు. వరద బాధితులకు సహాయం చేయాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు సంస్థ యాజమాన్యం ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలను విరాళం ఇచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సురభి శేఖర్ శ్రీనివాసరెడ్డి. జనరల్ మేనేజర్ వాసుదేవరావు డీ జీ ఎమ్ సుధాకర్. ఆర్ బీ రామారావు. జగన్ రెడ్డి ఏ జీ ఎమ్ రాజ్ కుమార్. ఇమాంపాషా. భక్తవత్సలరావు. శ్రీనివాస్. వీరశేఖర్. జయ ప్రకాష్. విజయ్ కుమార్.మరియు మేనేజర్స్ అండ్ సిబ్బంది పాల్గొన్నారు సంస్థ ఉద్యోగులు హర్షతిరేఖం వ్యక్తం చేసారు.


Comments