బాల్ బ్యాడ్మింటన్ జూనియర్స్ కు ఎంపికైన కూనూరు విద్యార్థులు
తెలంగాణ ముచ్చట్లు ,జఫర్గడ్:
హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జూనియర్ బాలబాలికల ఎంపిక క్రీడలు నిర్వహించారు. ఇందులో భాగంగా మండలం లోనికూ
నూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల లో 9వ తరగతి చదువుచున్న సుతారి రిషిత, డి అక్షయ ,మరియు వేముల హేమంత్ (10వ తరగతి ) ఈ పోటీల్లో ఎంపికయ్యారు. కాగా పల్లె గౌతమి (9వ తరగతి)స్టాండ్ బై గా ఎంపికయ్యారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఆకుల సాయికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పారదర్శకంగా ఎంపిక చేసిన బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి వీరన్న, ఉపాధ్యక్షులు గాదేపాక అయోధ్య మరియు జనగామ జిల్లా కోశాధికారి కాటం రాజిరెడ్డి కి ఫిజికల్ డైరెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.ఇట్టి క్రీడాకారులు 1వ తారీకు నుండి 3వ తారీకు వరకు జేఎన్ఎస్ స్టేడియంలో క్యాంపుకు హాజరు కావాలి తదనంతరం నాలుగో తారీకున హైదరాబాదులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి పాల్గొంటారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఆకుల సాయికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు కాగా వీరిని పాఠశాల హెడ్మాస్టర్ మరియు జఫర్గడ్ మండల విద్యాధికారి ఎండి పర్వేజ్ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు


Comments