రాష్ట్ర క్రీడ పాఠశాలకు శ్రావణ్ కుమార్ ఎంపిక
మక్తల్, తెలంగాణ ముచ్చట్లు:
హైదరాబాద్ హకీంపేట క్రీడా పాఠశాలలో జరిగిన రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాల ఎంపికలలో మక్తల్ సాయి జ్యోతి హై స్కూల్ విద్యార్థి శ్రావణ్ కుమార్ పాల్గొని ,అసమాన క్రీడా నైపుణ్యతను ప్రదర్శించి, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలలో నాలుగో తరగతి ప్రవేశం పొందుటకు ఎంపికయ్యాడని పాఠశాల కరెస్పాండెంట్ వెంకటయ్య, చైర్మన్ నర్సిములు,పిఈటి రమేష్ కుమార్ శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. శ్రావణ్ కుమార్ ల తల్లిదండ్రులు రంజిత్ కుమార్ ,శ్రీలక్ష్మి ఊట్కూరు మండలము ఎడవల్లి గ్రామానికి చెందినవారు కాగా, కూలి పని చేస్తూ తమ కుమారుని చదివిస్తున్నారని,. ఆదిలాబాద్ క్రీడా పాఠశాలలో నాలుగో తరగతిలో ప్రవేశం దొరకడం వారు ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, శ్రవణ్ కుమార్ కు 15 రోజులపాటు క్రీడా పాఠశాల కొరకు తొమ్మిది క్రీడాంశాలలో శిక్షణ ఇచ్చిన పిఈటిరమేష్ కు,పాఠశాల యాజమాన్యానికి తండ్రి రంజిత్ కృతజ్ఞతలు తెలియ జేశారు.సాయి జ్యోతి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థి ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు ఎంపిక కావడం పట్ల ఆ పాఠశాల కరస్పాండెంట్ వెంకటయ్య, చైర్మన్ నరసింహులు, హెచ్ ఎమ్ గోపాల్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రవిశంకర్ రెడ్డి, పీ ఈ టీ రమేష్ కుమార్, ఉపాధ్యాయులు జ్ఞానేశ్వరి,మంజుల, మహేశ్వరి,సుజాత,సంగీత, మోననాయక్, తిరుపతమ్మ,రమాదేవి, రవళి సంతోష్,శైలజ, జహంగీర్ , విద్యార్థులు శాలువాలతో అభినందించారు.


Comments