ప్రభుత్వ శాఖల యందు పనిచేస్తున్న సిబ్బందికి క్రీడా పోటీలు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
బుధవారం సర్దార్ పటేల్ స్టేడియం, ఖమ్మం నందు రాష్ట్ర క్రీడల శాఖ ఆదేశాలమేరకు జిల్లా కలెక్టర్ అనుమతితో జిల్లా యువజన, క్రీడా శాఖ ఆద్వర్యంలో ఈ నెల 29, గురువారం హాకీ లెజెండ్ “శ్రీ మేజర్ ధ్యాన్ చంద్” జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని “ నేషనల్ స్పోర్ట్స్ డే “ సందర్బంగా జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల యందు పనిచేస్తున్న సిబ్బందికి 13 క్రీడాంశాలలో పురుషులు, మహిళలకు పోటీలు నిర్వహించటం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమాన్ని శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, జిల్లా యువజన, క్రీడల అధికారి, తుంబూరు సునీల్ రెడ్డి, తెలంగాణ గెజిటెడ్ సంఘం జిల్లా అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ, కార్యదర్శి వేలాద్రి, టీఎన్జివోస్ అడ్ హాక్ కమిటి వైస్ చైర్మన్ శ్రీనివాసరావు, నాల్గో తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు బిక్కు, కోచ్ లు యం.డి. గౌస్, యం.డి. అక్బర్ అలీ, యం.డి. మతిన్, పరిపూర్ణ చారి, సురేష్, సాంబ మూర్తి, హరీష్, కైలాష్, జైనబ్ తస్లిం, చంద్రకాంత్, నగేష్, జిల్లా యువజన క్రీడల కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ క్రీడా పోటీలకు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళలు, పురుషులు, 500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. గురువారం “ నేషనల్ స్పోర్ట్స్ డే “ సందర్బంగా బుధ, గురువారాల్లో జరుగు క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానోత్సవం జరుగుతుంది.


Comments