రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన మోజర్ల ఉద్యానవన కళాశాల విద్యార్థులు
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగినటువంటి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో మోజర్ల ఉద్యానవన కళాశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
వివిధ అథ్లెటిక్స్ విభాగాలలో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది.
యు/23 బాలుర విభాగంలో షార్ట్పుట్ డిస్కస్ త్రోళ్లలో ఏ అరుణ్ కుమార్ ప్రథమ స్థానం.
యు/23 బాలికల విభాగంలో లాంగ్ జంప్ లో జి హారిక ప్రథమ స్థానం.
పురుషుల విభాగంలో పరుగులో 1500 మీటర్స్ లో
పి.వంశీకృష్ణ ప్రథమ స్థానంలొ నిలిచారు.
విజేతలు రేపు 17 18 తేదీ లలో మెదక్ జిల్లాలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరగబోయే తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారాని అలాగే రాష్ట్రస్థాయిలో జరుగు పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి కళాశాలకు మరియు వనపర్తి జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని.
అసోసియేట్ డీన్ డాక్టర్ పిడిగం సైదయ్య కోరారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ ఏ డాక్టర్ రాజశేఖర్ అసోసియేట్ ప్రొఫెసర్ పూర్ణిమ మిశ్రా ఫిజికల్ డైరెక్టర్ మహేష్ పాల్గొన్నారు.


Comments