టీమిండియా తర్వాతి మ్యాచ్ ఎప్పుడు, ఎవరితో ఆడనుందంటే? పూర్తి షెడ్యూల్ ఇదే..

టీమిండియా తర్వాతి మ్యాచ్ ఎప్పుడు, ఎవరితో ఆడనుందంటే? పూర్తి షెడ్యూల్ ఇదే..

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

చాలా కాలం తర్వాత భారత జట్టు టెస్టు సిరీస్‌కు సిద్ధం కానుంది. వన్డే ప్రపంచకప్‌, టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. త్వరలో జరగనున్న వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు పక్కా ప్లాన్‌ వేసింది. దీనికి ముందుగా బంగ్లాదేశ్‌తో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది.

భారత్-శ్రీలంక మధ్య సిరీస్ ముగిసింది. మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకోగా, వన్డే సిరీస్‌ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది. ముఖ్యంగా 27 ఏళ్ల తర్వాత లంకలో సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఘోర పరాభవాన్ని చవిచూసింది.
ఇప్పుడు ఈ సిరీస్ తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన టీమిండియా ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎందుకంటే, భారత్ తదుపరి సిరీస్ సెప్టెంబర్‌లో జరగనుంది. అంటే, వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ ద్వారా భారత ఆటగాళ్లు మళ్లీ బరిలోకి దిగనున్నారు.

సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో 2 టెస్టులు, 3 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. విశేషమేమిటంటే ఈ టెస్టు మ్యాచ్‌లు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సిరీస్‌లో భాగమే. కాబట్టి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్‌లు చాలా కీలకం. కాబట్టి, స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా నుంచి అద్భుతమైన ప్రదర్శనను ఆశించవచ్చు.

 

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .