జిల్లాలో 1,50,000 ఎకరాలలో మునగ సాగు చేసేలా చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

జిల్లాలో 1,50,000 ఎకరాలలో మునగ సాగు చేసేలా చర్యలు చేపట్టాలి

 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

జిల్లాలోని నర్సరీలు, మొరింగా ప్లాంటేషన్, అజోల్ల పెంపకం, కెనాల్ బండ్ ప్లాంటేషన్,మహిళా శక్తి యూనిట్లు,చేపల పెంపకం,పుట్టగొడుగుల పెంపకం, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక మరియు పీఎం విశ్వకర్మ పథకం అమలుపై జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీ వోలు, ఏపీవోలు, ఏపిఎంలు మరియు ఈసీఎస్ లతో ఐ డి ఓ సి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ నర్సరీల లో ఏదో ఒక మొక్కలు కాకుండా వాతావరణానికి మరియు ఆయుర్వేదంగా అనుకూలమైన మొక్కలు దొరంతో , డెకోమో, యూజీనియా , పండానాజ్ , సుబాబులు, వేప, రావి మరియు గానుగ మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని కెనాల్ ల రెండు వైపులా జామాయిల్, బాంబు, సుబాబుల్ మరియు యూకలిప్టక్స్ మొక్కలు నాటాలనిఅన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలో ప్రభుత్వ ఆఫీసుల్లో, మరియు కాళీ ప్రదేశాల్లో మునగ, ఉసిరి, పనస, మారేడు, మేడి మరియు అల్లనేరేడు మొక్కలు నాటాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు తమ పరిధిలోని గృహాలు ప్రభుత్వ ఆఫీసులు పంచాయతీ ప్రదేశాలు బట్టి ఎన్ని మొక్కలు పడతాయో అంచనా వేసుకోవాలని దాని ప్రకారం మొక్కల పెంపకం చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

వ్యవసాయం*

 జిల్లాలో 1,63 వేల ఎకరాల్లో వరి సాగు, 85 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు, రెండు లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని, రైతులకు వీటి సాగుతో పాటు అంతర్ పంటలు మరియు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు ప్రత్యామ్నాయంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఆయిల్ ఫామ్ మరియు అంతర్ పంటలుగా మోరింగా సాగు, మునగ సాగు,చేపల పెంపకం, బోర్ ఉన్న పంట పొలాల్లో పందిరి సాగు ద్వారా కూరగాయల పెంపకం చేపట్టడం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని ఆ విధంగా సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ పంటల సాగుకు అవసరమైన ఫామ్ పౌండ్, సాగుకు అవసరమైన గుంతలను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టవచ్చని ఆయన తెలిపారు. ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఆయిల్ ఫామ్ తోటల్లో కోకో సాగును చేపట్టడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అన్నారు. జిల్లాలో 1,50,000 ఎకరాల్లో మునగ సాగు లక్ష్యంగా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో చేపల పెంపకం,పుట్టగొడుగుల పెంపకం, అజోల్ల పెంపకం, నాటు కోళ్ల పెంపకం మరియు బాతుల పెంపకం ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చని, దానికి తగిన అవగాహన కల్పించాలని అన్నారు.

మహిళా శక్తి యూనిట్లు* .

 జిల్లాలో మహిళా శక్తి సమాఖ్య ద్వారా ఏర్పాటు చేస్తున్న మహిళా శక్తి యూనిట్లలో ఆహార సంబంధిత క్యాంటీన్లు, తినుబండారాలు, సాంప్రదాయ వంటలు తయారీ మీద దృష్టి సారించాలన్నారు. మహిళా శక్తి యూనిట్లలో తమ వస్తువుల అమ్మకంలో ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలన్నారు. జిల్లాలో మంజూరైన 15 చేపల పెంపకం యూనిట్లను ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

*గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక*-

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా అన్ని పంచాయతీలలో పంచాయతీలకు సొంత భవనాలు ఉన్నాయా, లేదా, అంగన్వాడి కేంద్రాలు ప్రభుత్వ భవనాలు ఉన్నాయా, అద్దె భవనాలు ఉన్నాయా, పంచాయతీల్లో అప్రోచ్ రోడ్లు, అంతర్గత రోడ్లు, పంట పొలాలకు వెళ్ళు రోడ్ల వివరాలు, అంగన్వాడీలు మరియు వివరాలు, గ్రామపంచాయతీలో నిర్వహించు సంత వివరాలు, ఉన్నటువంటి కెనాల్ మరియు వాగుల వివరాల తో కూడిన సమగ్ర నివేదికను ఈ నెల 20వ తారీకు లోగా నిర్దేశించిన పట్టిక ద్వారా అందజేయాలని ఆదేశించారు. ఈ నివేదికల ద్వారా గ్రామపంచాయతీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి, పంచాయతీలను అభివృద్ధి పరచడానికి అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

 *పీఎం విశ్వకర్మ పథకం -*

జిల్లాలో ఇప్పటివరకు పీఎం విశ్వకర్మ పథకం కు 11500 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని, ప్రతి గ్రామపంచాయతీలో 18 కులవృత్తులు చేసే వారందరూ ఈ పథకానికి అర్హులని ఆయన అన్నారు. ప్రతి పంచాయతీ కార్యదర్శి తమ పంచాయతీ పరిధిలోని 18 కులవృత్తులు చేసే వారి అందరి కి ఈ పీఎం విశ్వకర్మ పథకం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, అదనపు డిఆర్డిఓ ఎన్ రవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా ఇండస్ట్రీస్ మేనేజర్ పృథ్వి, శ్రీనిధి ఆర్ఎం శ్రీనివాస్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .