విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు పటిష్ట చర్యలు

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు పటిష్ట చర్యలు

 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.గురువారం జిల్లాలో ఉన్న గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళ నిర్వహణపై సమీకృత జిల్లా కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి జిల్లా కలెక్టర్, సంక్షేమ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రి మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ లలో అందిస్తున్న భోజనం, పిల్లలు పడుకునేందుకు డార్మెటరీ, మంచాలు, మరుగుదొడ్లు, స్నానాల గదుల లభ్యత, కుక్, వార్డెన్, హెల్త్ అసిస్టెంట్లకు అవసరమైన శిక్షణ, తదితర అంశాలపై అదనపు కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ప్రతి వారం జిల్లాలోని వివిధ వర్గాల అభివృద్ధి అధికారులు 3 సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసి, భోజనం నాణ్యతను పరిశీలించాలని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో భోజన పదార్థాలు, సామాగ్రి సరఫరా టెండర్ జారీ చేసే సమయంలో గత రికార్డులను పరిశీలించి అర్హులకు, నాణ్యమైన పదార్థాలు సరఫరా చేసిన వారికే అందజేయాలని కలెక్టర్ తెలిపారు. వసతి గృహాలలో టాయిలెట్ల నిర్వహణ స్థితిగతుల వివరాలు కలెక్టర్ తెలుసు కున్నారు. ప్రతి రోజూ టాయిలెట్లను శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. హాస్టల్ లలో పారిశుధ్య నిర్వహణ సంబంధించి ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలన్నారు. వసతి గృహాలకు వచ్చిన ఆహార పదార్థాలు, సరుకుల నాణ్యతను పరిశీలించి డెలీవరి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి హాస్టల్ లో విద్యార్థులతో ఫుడ్ కమిటీ ఏర్పాటు చేయాలని, ఆహార పదార్థాల డెలివరీ, స్టోరేజిలో వీరిని భాగస్వామ్యం చేయాలని అన్నారు. హాస్టల్ లో పిల్లలకు ఎప్పుడూ తాజా భోజనం అందించాలని, నిల్వ చేసిన ఆహారం అందించకూడదని అన్నారు. హాస్టల్ లో విద్యార్థులకు స్వచ్చమైన త్రాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. హాస్టల్ లో విద్యార్థులు కొంత సమయం ఆహ్లాదంగా గడిపేందుకు అవసరమైన స్పోర్ట్స్ మెటీరియల్ కల్పించాలని అన్నారు. పిల్లలు వినోదాత్మకంగా గడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. హాస్టల్ లలో డోర్స్, కిటికీలకు వెంటనే మెష్ జాలీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బాలికల హస్టల్స్ లో రుతుక్రమం సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, శానిటరీ న్యాప్ కిన్ డిస్పోజల్ పై అవగాహన కల్పించాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ, ప్రతి శాఖ పరిధిలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రీ, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ వివరాలు ఆరా తీశారు. ప్రభుత్వ వసతి గృహాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రకారం అవసరమైన మేర మంచాలు, పరుపులు ఉండాలని, తక్కువ ఉంటే అందించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. హాస్టల్స్ లో పుడ్ కమిటీ సంబంధిత విద్యార్థులతో ఏర్పాటు చేయాలని, ఫుడ్ కమిటీలో కొత్తగా చేరే పిల్లలను భాగస్వామ్యం చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.  దసరా సెలవులలో పిల్లలు ఉండని నేపథ్యంలో వసతి గృహాల్లో పనిచేసే వంట సిబ్బంది, వార్డెన్ లకు విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం అందించడంపై అవసరమైన శిక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న హాస్టల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ప్రకారం అవసరమైన అదనపు టాయిలెట్ల నిర్మాణం, ఉన్న టాయిలెట్ల మరమ్మత్తు ప్రతిపాదనలు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా బీసి అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి, జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి కె. సత్యనారాయణ, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిణి విజయలక్ష్మి, జిల్లా ఇంచార్జ్ మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కె. సత్యనారాయణ, ఆర్.సి.ఓ లు కత్తి వెంకట రామయ్య, కె. నాగేశ్వరరావు, ఇఇ లు పి. విన్సెంట్ రావు, ఎన్.ఎస్. రామ కోటి, డిఇ లు, ఏఇ లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .