కష్టపడి చదివి మంచి డాక్టర్ అవ్వాలి 

సత్యసాయి సేవ సమితి ఖమ్మం కన్వీనర్ ఆలిశ్యం నరసింహారావు

కష్టపడి చదివి మంచి డాక్టర్ అవ్వాలి 

 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న తల్లితండ్రులు లేక తాత సంరక్షణలో వున్న శ్రీ హర్షిత అను ఒక నిరుపేద విద్యార్థినికి వనపర్తి ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో సీట్ వచ్చి ఆర్థిక ఇబ్బందులవలనచదువుకుఇబ్బందిఅవుతున్నదని తెలిసి ఆ విద్యార్థినికి పుట్టపర్తి సాయిబాబా స్వామి వారి ఆశీస్సులతో ఖమ్మం సత్యసాయి సేవా సంస్థ తరఫున 25,000 రూపాయల విలువ చేసే ఆమె చదువుకు అవసరమైన మెటీరియల్ మరియు కొంత నగదు మొత్తం ఆదివారం వారి గ్రామమునకు వెళ్లి ఆ విద్యార్థినికి అందచేయుట జరిగినది. ఈ మహత్తర సేవా కార్యక్రమములో ఖమ్మం సమితి కన్వీనర్ ఆలస్యం నరసింహారావు, యూత్ సభ్యుడు జె.సతీష్ కుమార్, సమితి సభ్యులు ఆర్.నాగరాజు ( పీహెచ్బీ ఇన్స్ట్రక్టర్ ) మరియు వి. సైదులు పాల్గొన్నారు. ఇటువంటి తోడ్పాటు నందించే సేవా కార్యక్రమములో పాల్గొనే అవకాశము కలిగించిన స్వామి వారికి కృతజ్ఞతలు తెలియ చేసుకుంటూ, ఇలాగే ఆ చిరంజీవి యొక్క చదువుకు ఎలాంటి విఘ్నం లేకుండా చదువు పూర్తి చేయించమని స్వామి వారిని ప్రార్థిస్తున్నాము అని వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .