ఉచిత స్కిల్ శిక్షణ ను సద్వినియోగం చేసుకోండి

తెలంగాణ ముచ్చట్లు, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-

రాష్ట్ర ప్రభుత్వంచే స్థాపించబడిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసి), ఈజీఎంఎం సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని యువకులకు ఉచిత స్కిల్ శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎన్ఏసి అసిస్టెంట్ డైరెక్టర్ నాగేందర్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లంబింగ్ శానిటేషన్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కోర్సులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పించడం జరుగుతుందని, కోర్సుకు అవసరమయ్యే పుస్తకాలు, యూనిఫామ్, షూస్, హెల్మెట్, ట్రైనింగ్ కోర్స్ మెటీరియల్ ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. కోర్సు పూర్తి చేసిన వారికి ఎన్ఏసి సర్టిఫికెట్ తో పాటు ప్రైవేటు కంపెనీలో ఉపాధి అవకాశం చూపించడం జరుగుతుందన్నారు. పదో తరగతి చదివి, 18 నుండి 30 సంవత్సరాల వయస్సు గల యువకులు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని శిక్షణ కేంద్రంలో అక్టోబర్ 16 నుండి మూడు నెలలపాటుశిక్షణకార్యక్రమంనిర్వహించడంజరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 8328507232, 8790414049 నెంబర్లను సంప్రదించాల్సిందిగా సూచించారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .