ఐలమ్మ పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపికి లేదు..

-సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సింగారపు రమేష్

ఐలమ్మ పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపికి లేదు..

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు దొరల గుండెల్లో సింహ స్వప్నమై నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి దొరలను గడియల నుంచి ఉడికించి తరిమికొట్టిన వీర వనిత చిట్యాల ఐలమ్మ గారి పోరాటం గురించి వర్ధంతి సభ గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపికి లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్ అన్నారు.గురువారం రోజున సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతంగ సాయుధ పోరాటానికి ఏమాత్రం సంబంధం లేని బిజెపి ఐలమ్మ పోరాటం గురించి వర్ధంతి సభల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని,నిన్న పాలకుర్తి సెంటర్ లో జరిగిన ఐలమ్మ 39వ వర్ధంతి సభ సిపిఎం ఆధ్వర్యంలో ప్రజానాట్యమండలి కళాకారులు రాష్ట్రవ్యాప్తంగా వీరుల వ్యాధిలో శౌర్య యాత్ర పేరుతో పాలకుర్తి మండల కేంద్రానికి చేరుకోని నాడు సాగిన వీర తెలంగాణ రైతంగ సాయుధ పోరాట ఘట్టాలను కండ్ల కట్టినట్టుగా కళాకారులు ప్రదర్శించారని,ఈ వర్ధంతి సభ సిపిఎం ఆధ్వర్యంలో జరిగిందని,ఆనాడు నైజాం రజాకారులు జాగిదారులు జమీందారులు భూస్వాములు భూములను వారి చేతుల్లో ఉంచుకొని ప్రజలను దోపిడీకి పీడనకు గురవుతున్న ప్రజలను ఏకం చేసి పోరాటం చేయడంతో పాటు కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా పోరాటాల ఫలితంగా తెలంగాణ ప్రాంతంలో పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి పెట్టిన చరిత్ర కమ్యూనిస్టులదని,ఈ పోరాట ఫలితంగా దేశంలో భూ సంస్కరణలు రావడానికి నాంది పలికిందని,ఈ పోరాటంలో 4,000 మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని,ఇంతటి మహత్తర పోరాటంలో వక్రీకరిస్తూ విముక్తి విమోచన అంటూ అనేక వక్రభాష్యాలు చేస్తూ ఈ పోరాటం ముస్లింలకు హిందువులకు మధ్య జరిగిన పోరాటమని,బిజెపి వక్రీకరించడం సరైన పద్ధతి కాదని,ఆనాడు నైజం సంస్థానంలో ముస్లింలే మొదటి కమ్యూనిస్టు పార్టీ స్థాపించడమే కాక ఐదు సంవత్సరాల పోరాటంలో అనేక మంది ముస్లింలు సాయుధ పోరాటంలో పాల్గొని తమ ప్రాణాలను అర్పించారని,ఈ వాస్తవాలను ఎలా కప్పిపుచ్చుతారని?ఇంతటి మహత్తరమైన పోరాటంలో పోరాటంలో బిజెపి పాత్ర ఏమిటో బిజెపి నాయకులు చెప్పాలని,ఎంతమంది బిజెపి కార్యకర్తలు వారి ప్రాణాలను బలిదానం చేశారో చెప్పాలని,బిజెపి తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పోరాటానికి మతం రంగు పులిమి ఓట్ల రాజకీయం చేస్తూ మతపరంగా రెచ్చగొడుతూ సాయుధ పోరాటానికి వక్ర భాష్యాలు చెబుతూ రాజకీయ పదం గడుపుకుంటుంది బిజెపి అని,ఇప్పటికైనా బిజెపి నాయకులు చౌకబారు విమర్శలు మానుకోవాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ప్రజల్ని ఐక్యం చేసి తగిన బుద్ధి చెబుతారని వారు అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య,తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .