రైతాంగ సాయుధ పోరాట సభను జయప్రదం చేయాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్
తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల:
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు దొడ్డి కొమురయ్య.షేక్ బందగి. కాచం కృష్ణమూర్తి స్తూపాల దగ్గర నేడు నివాళులర్పించి న అనంతరం అక్కడ జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ పోరాటం నేటికి 76 వసంతాలు పూర్తి చేసుకుందని నాటి నైజాం దేశముఖ్ దొరలు జమీందారులు పెత్తందారులకు వ్యతిరేకంగా ప్రజలు ఉవ్వెత్తున కదలారని మన దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చిన తెలంగాణకు మాత్రం రాలేదని అన్నారు.తెలంగాణ నైజాం నిరంకుశ ఉక్కు బూట్ల కింద నలిగిపోయిందని దొరలు భూస్వాములు ప్రజలను అనేక రకాలుగా హింసించి చిత్రహింసలకు గురి చేశారని గుర్తు చేశారు.విసునూరు రాపాక రామచంద్ర రెడ్డి కొడుకు బాబు దొర మహిళలను అనేక రకాలుగా హింసకు గురి చేశారని తెలిపారు.పెత్తందార్లు ప్రజలకు కూలి ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకున్నారని ఎదురు తిరిగిన వారికి మరణం తప్పదని నైజాం దోపిడీకి వ్యతిరేకంగా 1947,49 మధ్యకాలంలో ప్రజలు ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున రగిలిందని బానిసలుగా గురైన వారు బంధకులు పట్టి పుచ్చలపల్లి సుందరయ్య. మల్లు స్వరాజ్యం దొడ్డి కొమురయ్య. చాకలి ఐలమ్మ వీరి నాయకత్వాన ప్రజలు పెద్ద ఎత్తున కదలి ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరచి బాంచన్ దొర అన్న చేతులతో బంధకులు పట్టి చాకిరి చేసిన చేతులతో వడిసెలు పట్టించారన్నారు. ఖబర్దార్ నైజాం అంటూ దున్నేవాడికి భూమి అని గర్జించారని తెలిపారు.సాయిధ పోరాటం ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాల చేత లిఖింపబడిందని ఇంతటి పోరాట చరిత్రను కొందరు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఈ పోరాటానికి సంబంధం లేని వారు కూడా మేమే పోరాటం చేశామని చెప్పి కులం మతం రంగు పూసి గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు.నేడు దేవర్పుల మండలంలోని వివిధ గ్రామాలలో 35 మంది కళాకారులతో వీర తెలంగాణ నాటక కళారూపాలు ప్రదర్శనలు ఇస్తుందని ప్రజలు సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.


Comments