TG.గ్రూపు 4 పరీక్ష ఫలితాలు ప్రకటించాలి.. గాంధీ భవన్ ముట్టడికి యత్నించిన అభ్యర్థులు..!!

TG.గ్రూపు 4 పరీక్ష ఫలితాలు ప్రకటించాలి.. గాంధీ భవన్ ముట్టడికి యత్నించిన అభ్యర్థులు..!!

తెలంగాణలో గ్రూపు 4 పరీక్ష ఫైనల్ ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, గాంధీ భవన్ ముట్టడికి గ్రూపు 4 అభ్యర్థులు ప్రయత్నించారు.సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయి రెండు నెలలు అయినా ఇప్పటికీ ఉద్యోగాలు కేటాయించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. తాము నిర్లక్ష్యం చేయకుండా త్వరగా పూర్తి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు.తాజాగా గాంధీభవన్ ముట్టడికి పెద్ద ఎత్తున తరలివచ్చిన అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసి 460 రోజులు అవుతుందని.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా అయ్యిందని అభ్యర్థులు తెలిపారు. డీఎస్సీ పోస్టులకు 56 రోజుల్లో పూర్తిచేసిన టీజీపీఎస్సీ అధికారులు.. ఎనిమిది వేల గ్రూప్ ఫోర్ పోస్టులకు 460 రోజులు ఎలా సమయం పడుతుంది అని ప్రశ్నించారు. వెంటనే ఇతర ప్రక్రియలు పూర్తిచేసి ఈ దసరా పండుగ వరకు గ్రూప్ 4 తుది ఫలితాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అభ్యర్థులు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .