పీఆర్టీయూ జిల్లా కమిటీలో ధర్మసాగర్ మండల టీచర్లకు కీలక పదవులు
-జిల్లా కార్యాలయంలో పదవులు పొందిన ఉపాధ్యాయుల ప్రమాణ స్వీకారం
-జిల్లా అధ్యక్ష,కార్యదర్శులకు ధన్యవాదాలు తెలిపిన మండల శాఖా
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
పీఆర్టీయూ టీఎస్ హనుమకొండ జిల్లా శాఖ కార్యవర్గ విస్తరణలో భాగంగా ధర్మసాగర్ మండలంలోని పలుగ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జిల్లా కమిటీలో పలు కీలక పదవులు లభించాయి.ఈ సందర్భంగా జిల్లా కార్యాలయంలో పదవులు పొందిన ఉపాధ్యాయులు ప్రమాణ స్వీకారం చేశారు.అనంతరం వారికీ మండల బాధ్యులు,పలువురు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేశారు.జిల్లా కార్యవర్గంలో అసోసియేట్అధ్యక్షులుగా బి.సమ్మిరెడ్డి,ఎస్విఆర్ఎస్ శర్మ,
ఉపాధ్యక్షులుగా ఎ.అంజయ్య,ఎస్ కుమారస్వామి,డి శ్రీకాంత్ రెడ్డి,జె.సంపత్,సెక్రెటరీలుగా ఆర్. శ్యామ్ సుందర్,ఎ.చంద్రకళ, సిహెచ్.కమల,సిహెచ్.సునీత,ఇ.సువర్ణలు పదవులు పొందారు.
ధర్మసాగర్ మండల ఉపాధ్యాయులకు జిల్లా శాఖలో తగిన ప్రాధాన్యత ఇచ్చిన హనుమకొండ జిల్లా శాఖ అధ్యక్షులు మందల తిరుపతి రెడ్డికి,ప్రధాన కార్యదర్శి ఫలిత శ్రీహరికి, మండల శాఖ అధ్యక్షులు అనిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కార్యదర్శి అజ్మీర జాన్ సింగ్ ధర్మసాగర్ మండల శాఖ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Comments