నష్టం వివరాలను అధికారులు పారదర్శకంగా చేపట్టాలి 

-జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

నష్టం వివరాలను అధికారులు పారదర్శకంగా చేపట్టాలి 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

మున్నేరు వరద ముంపు ప్రాంతాలలో జరిగిన నష్టం వివరాలను అధికారులు పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ తెలిపారు. మంగళవారం ఖమ్మం నగర కార్పోరేషన్ కార్యాలయంలో మున్నేరు వరదలో ప్రజలు కోల్పోయిన అస్ధి నష్టం వివరాలను సేకరించడం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారులు, సిబ్బందితో జిల్లా కలెక్టర్ ముజ్మమిల్ ఖాన్ మ మున్సిపల్ కమిషనర్ అభిషేక్ ఆగస్త్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్నేరు వరద ప్రవాహం ఏ ఏ ప్రాంతాలలో ముంపు గురియైన వివరాలు, ఎంతమేరకు నష్టం వాట్లింది సర్వే చేయడం కోసం మొత్తం 14 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వరద ప్రాంతాల్లో నీరు ఎక్కడ వరకు వచ్చింది ఎంత శాతం నష్టం జరిగింది అనేది ఈ సర్వేలో అంచనా తెలుస్తుంది అన్నారు. అవకతవకలు లేకుండా స్పష్టంగా అధికారులు సర్వే చేయాలని కలెక్టర్ సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఇళ్లు, ఇళ్లు తిరుగుతూ పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాలని చెప్పారు. ఏలాంటి ఒత్తిడి లకు తావుఇవ్వకుండా భాదితుల సమాచారం తీసుకొవాలని తెలిపారు. నిబద్ధత తో పని చేసి ఏ ఒక ఇళ్లు తప్పకుండా తిరుగుతూ నష్టం అంచనాలను పొందుపర్చాలని వివరించారు. సర్వే లో తప్పనిసరిగా నష్టం జరిగిన ఇంటి పోటోను గుర్తింపు గా అధికారులు తీసుకోవాలని చెప్పారు.

ఈ సమావేశం లో జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఖమ్మం నగరపాలక సంస్థ సహాయ కమీషనర్ సంపత్, అధికారులు, తదితరులు ఉన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .