నూకల నరేష్ రెడ్డి మృతి పట్లమాజీ ఎంపీ నామ విచారం
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
సీనియర్ రాజకీయ నాయకులు, మరిపెడ మండలం పురుషోత్తమయ గూడెం గ్రామానికి చెందిన నూకల నరేష్ రెడ్డి మృతి పట్ల బీఆర్‌ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. నూకల నరేష్ రెడ్డి కుటుంబంతో ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయని, నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని నామ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని, 17వ లోక్ సభ ఎన్నికల్లో తన విజయానికి నూకల నరేష్ రెడ్డి అహర్నిశలు కృషి చేశారని, వారు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన ప్రజల సంక్షేమానికి ఎంతో తోడ్పాటును అందించారని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


Comments