అధికార ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి
ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికే అధికార ప్రతిపక్షాలు దాగుడుమూతల రాజకీయాలు చేస్తున్నాయి
మెట్టు శ్రీధర్ వ్యవస్థాపక అధ్యక్షులు నవభారత్ నిర్మాన్ యువసేన
మెదక్,తెలంగాణ ముచ్చట్లు: అధికార ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికే అధికార ప్రతిపక్షాలు దాగుడుమూతల రాజకీయాలు చేస్తున్నాయని నవభారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు మెట్టుశ్రీధర్ విమర్శించారు వ్యక్తిగత ఆరోపణలు వ్యక్తిగత దూషణలతో రాష్ట్రం పరువును తీస్తున్నారని ప్రజలు సీజనల్ వ్యాధులతో భాధపడుతూ ఆస్పత్రులపాలవుతుంటే ప్రభుత్వ ప్రతిపక్షాలు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి సామాన్యుడు ప్రవేటు ఆస్పత్రికి వెళ్తే టెస్టులు మెడిసిన్ల కోసం వేలాదిరుపాయల బిల్లులు వసూలు చేస్తున్నారని మెట్టుశ్రీధర్ అన్నారు విద్య వైద్యం సామాన్యప్రజానికానికి పెనుభారంగా మారిందని వాటిని నియంత్రించే వ్యవస్థలు లేకపోవడంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విద్యావైద్యాన్ని వ్యాపారదోరనితో కాకుండా మానవతా దృక్పతంతో చూసేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మెట్టుశ్రీధర్ కోరారు ఇప్పటికైనా ప్రభుత్వ ప్రతిపక్షాలు ప్రజాసమస్యలపై దృష్టి సారిస్తే బావుంటుందని హితవు పలికారు.


Comments